సాహితి – నాట్యయాత్రలో ఒక వెలుగుజ్యోతి
సాంప్రదాయ కళలలో కూచిపూడి శాశ్వత కాంతివంతమైన రత్నమైతే, దానిని ఆరాధిస్తూ నిత్యసాధనతో చేస్తున్న మన సాహితి. భావం, లయ, రాగాలకు మేళవించిన ఆమె అడుగులు, ప్రతి వేదికపై కళామాధుర్యాన్ని విరజిమ్ముతున్నాయి.
ప్రతిభను చాటిన వేదికలు
తన వయసుకు మించిన ప్రతిభతో సాహితి ఇప్పటివరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో, మహోత్సవాలలో నాట్యకళను ఆవిష్కరించింది. ఎక్కడ నర్తించినా ప్రేక్షకుల హృదయాలను ఆకర్షిస్తూ, చప్పట్ల వర్షాన్ని కురిపించింది.
విశాఖపట్నంలో గర్వకారణ క్షణం
2025 సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో జరిగిన సాంస్కృతిక అవుట్‌రీచ్ కార్యక్రమంలో సాహితి తన కూచిపూడి బృందంతో కలిసి నాట్యరూపకాన్ని అందించింది.
ఆ వేదికను మరింత విశిష్టంగా నిలబెట్టిన ముఖ్య అతిథులు –
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు.
వారి సమక్షంలో సాహితి ప్రదర్శన ఒక చారిత్రాత్మక ముద్ర వేశింది
తిరుమలలో దివ్యావకాశం
తిరుమలలో ఆండాళ్ అమ్మవారిగా (గోదాదేవి రూపంలో) చేసిన ఆమె నృత్యప్రదర్శన. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ భక్తిరసపూర్ణ నాట్యమయూరం అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దైవసాన్నిధ్యంలో నర్తించిన ఆ క్షణం సాహితి జీవితంలో ఒక అనన్యమైన, అపూర్వమైన దివ్యానుభూతిగా నిలిచింది. ఈ పవిత్ర వేదికపై ఆమె భక్తి, నాట్యభావం, సాంస్కృతిక నిబద్ధత అన్నీ కలసి వెలుగులీనాయి
తల్లిదండ్రుల హర్షం – గురువుల ఆశీర్వాదం
సాహితి ప్రతీ నృత్యం వెనుక ఉన్న అంకితభావం, శ్రమ, గురువుల మార్గదర్శకత తల్లిదండ్రుల హృదయాలను ఆనందంతో నింపుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సాహితి అడుగులు నాదములై మార్మోగాలని ఆకాంక్షిద్దాం.
సాహితి నాట్యప్రస్థానంలో ఆమె తల్లిదండ్రులైన జీడిగుంట సురేష్ గారు, నీలిమ గారు నిరంతర ప్రోత్సాహం, అంకితభావం, మరియు శ్రమ ఎంతో విశేషమైనది.
వారి సహకారం, మార్గనిర్దేశం, ఆప్యాయత లేకుండా ఈ ప్రస్థానం ఇంత వెలుగుని చేరేది కాదు.
సాహితి ప్రతి విజయానికి వెనుక తల్లిదండ్రుల ఆప్యాయ కృషి ఒక బలమైన ఆధారంగా నిలిచింది




